‘సాహో’ టీం కు అక్కడ పనైపోయింది.. నెక్స్ట్ ఎక్కడంటే?

ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చెప్పుకోవడానికి ప్రభాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ… అవి భారీ బడ్జెట్ సినిమాలు అందులోను.. మూడు, నాలుగు భాషల్లో తెరకెక్కిస్తుండడంతో కాస్త లేటవుతుంది. దీంతో ఆ చిత్రానికి సంబందించిన షూటింగ్ పిక్స్, మేకింగ్ వీడియోలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ చిత్రం గత మూడు వారాలగా ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. కొన్ని కీలక సన్నివేశాల్ని అక్కడ చిత్రీకరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయ్యిందట.

ఇక తర్వాతి షెడ్యూల్ ను త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. కొంత ఫ్యాచ్ వర్క్ కూడా చిత్రీకరించబోతున్నారట. దీని తరువాత యూరప్ షెడ్యూల్ కూడా లైన్ లో ఉంది. శ్రద్ధా కపూర్ -ప్రభాస్ ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను అక్కడ చిత్రీకరించనున్నారు. దీంతో దాదాపు మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తిచేసేలా ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి ఆగష్టు 15న విడుదల చేసే విధంగా ముందుకు సాగుతుంది చిత్ర యూనిట్. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus