అప్పుడే ‘సాహో’ రికార్డులు మొదలైపోయాయి

‘బాహుబలి2’ తరువాత సుమారు రెండేళ్ళ గ్యాప్ తీసుకుని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండీ వస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో ‘యూవీ.క్రియేషన్స్’ బ్యానర్ పై ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వంశీ, ప్రమోద్, విక్రమ్ లు నిర్మించారు. మరో 24 గంటల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ‘యూఎస్ ప్రీమియర్స్’ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఐమాక్స్ షోస్ తోనే కాదు రెగ్యులర్ షో బుకింగ్స్ లో కూడా ‘సాహో’ రికార్డ్ కలెక్షన్స్ నమోదుచేస్తుంది. ఆగస్టు 28 అంటే బుధవారం వరకూ అందిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం అన్ని భాషలు కలిపి $532,727 వసూళ్ళు రావడం విశేషం. అయితే కేవలం తెలుగు ఐమాక్స్ మరియు రెగ్యులర్ షో బుకింగ్స్ తోనే $511,702 వసూళ్ళు రావడంతో ట్రేడ్ సైతం షాక్ అవుతున్నారు.

ఇక హిందీ వర్షన్ కు గాను $16,899 మరియు తమిళ వర్షన్ కు $4,126 వసూళ్ళు వచ్చాయి. మొత్తంగా అన్ని భాషల ఐమాక్స్ షో లకే $77418 మరియు రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $455309 వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక నేడు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి కాబట్టి కల్లెక్షన్లు మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటి వరకూ ‘బాహుబలి’ ‘బాహుబలి2’ తీసేస్తే పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ మాత్రమే ప్రీమియర్స్ తో రికార్డులు సృష్టించింది. మరి ‘సాహో’ తో ప్రభాస్ ఆ రికార్డును బ్రేక్ చేస్తాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus