ప్రభాస్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న ‘స్పైడర్’ సెంటిమెంట్లు..!

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నుండీ వస్తున్న చిత్రం ‘సాహో’ . సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ను మహేష్ ‘స్పైడర్’ సినిమా భయపెడుతుందట. అసలు ‘స్పైడర్’ కి ‘సాహో’ సంబంధమేంటి అనేగా మీ డౌట్? విషయమేమిటంటే మహేష్ కెరీర్లో బైలింగ్యువల్ మూవీ గా వచ్చిన ‘స్పైడర్’. టీజర్ తో ఆకట్టుకుంది. కానీ పాటలు మాత్రం తమిళ వాసన కొట్టడంతో అనుమానాలు మొదలయ్యాయి. మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని125 కోట్ల భారీ బడ్జెట్ తో ఠాగూర్’ మధు నిర్మించాడు. అయితే ఈ చిత్రం మొత్తం తమిళ నేటివిటీ ఎక్కువైపోయిందని మన తెలుగు ప్రేక్షకులు ఘోరంగా తిప్పికొట్టారు. ఫలితం 70 కోట్లకు పైనే భారీ నష్టం వాటిల్లింది.

ఇప్పడు ‘సాహో’ విషయానికి వస్తే.. ఈ చిత్రం టీజర్ అమితంగా ఆకట్టుకుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక తాజాగా విడుదలైన ‘సైకో సయ్యాన్’ పాట చూస్తే మొత్తం బాలీవుడ్ స్టైల్ లోనే కనిపించింది. తెలుగు ప్రేక్షకులను ఈ పాట ఆకట్టుకోలేదు. ముందు హిందీ లో చేసి తరువాత తెలుగులోకి అనువదించినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. ‘సాహో’ లో మురళీ శర్మ,వెన్నెల కిశోర్ వంటి వారిని పక్కన పెడితే.. హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో మొదలు.. సినిమాలో 70 శాతం పైనే బాలీవుడ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. ‘స్పైడర్’ లో కూడా అంతే.. రకుల్, ప్రియదర్శి, నాగినీడు ని పక్కన పెడితే అందరూ అరవం బ్యాచే…! ‘బైలింగ్యుల్ మూవీ అంటే మాటలు కాదు.. రెండు భాషాల ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించాలి.

‘స్పైడర్’ విషయంలో ఆ తప్పే జరిగింది. మొదట తమిళ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకుల గురించి ఆలోచించేసరికి లేటైపోయింది’ అంటూ మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజానికి బైలింగ్యువల్ మూవీ అంటే కష్టమే.. అయితే ‘స్పైడర్’ ఒక సంవత్సరం మాత్రమే టైం తీసుకున్నారు కాబట్టి అటూ.. ఇటూ కష్టమైంది. కానీ ‘సాహో’ రెండేళ్ళ సమయం తీసుకున్నారు. బాలీవుడ్ ఛాయలు ఎక్కువైనా తెలుగు ప్రేక్షకులు ఓకే చెప్పే అవకాశం ఉంది. అందులోనూ సక్సెస్ పెర్సెంటేజ్ బాగా ఉన్న ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు కాబట్టి సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చే ఉంటుంది అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో ఉంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఇక ‘సాహో’ చిత్రం తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఆగష్టు 15 న విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus