యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘సాహో’ ట్రైలర్

దేశం మొత్తం ఇప్పుడు ‘సాహో’ చిత్రం కోసమే ఎదురుచూస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘డైరెక్టర్ కు ఇది కేవలం రెండో సినిమానే కదా.. ఏం తీస్తాడు.. ఇంత ఖర్చెందుకు… సినిమా కచ్చితంగా ప్లాపే’ ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ ముందునుండీ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ప్రతీ అప్డేట్ తోనే ఆ కామెంట్స్ కు బ్రేక్ వేస్తూనే ఉన్నారు ‘సాహో’ టీం. ఇపప్టికే విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. అయితే పాటల విషయంలో మళ్ళీ ట్రోల్ చేస్తూ వచ్చారు.

వీటికి ట్రైలర్స్ తో ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసారు. తాజగా విడుదల చేసిన ట్రైలర్.. నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంధనే చెప్పాలి. పెట్టిన ఖర్చంతా ట్రైలర్లో కనిపిస్తుంది. ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. యాక్షన్ సీన్లు అయితే ఇరక్కొట్టేశాడనే చెప్పాలి. దీంతో యూట్యూబ్ రికార్డులు కూడా బద్దలవుతున్నాయి. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషలు కలుపుకుని 51 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఓ తెలుగు సినిమా కోసం పరభాషా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండడం నిజంగా విశేషమని చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus