టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు సినిమా అంటే ప్రాణం.. నాకు అల్లు అర్జున్ అంటే క్రష్ ఫీలింగ్ : నటి ఆరుషి వర్మ

సుధీర్ వర్మ దర్శకత్వంలో  ‘శాకిని డాకిని’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. కొరియన్ మూవీ ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది.డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో  రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇదే మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ మోడల్ ఆరుషి వర్మ. ఈ సినిమా కథంతా ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. ఆరుషి వర్మ కూడా చాలా బాగా నటించింది. ఇప్పుడు ఈమెను వెతుక్కుంటూ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

తెలుగులో మీ మొదటి చిత్రం ‘శాకిని డాకిని’.. ఈ చిత్రంలో మీకు అవకాశం ఎలా వచ్చింది?

ఆరుషి వర్మ : నేను గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరంలో ఉండగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. నటి అవ్వాలనే కోరిక నాలో పెరిగింది. ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చూసి ‘శాకిని డాకిని’ ఆడిషన్ ఇచ్చాను. రెండు రౌండ్లు ఫినిష్ అయ్యాక నేను సెలక్ట్  అయ్యాను అని తెలిసింది. అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది.

నివేదా థామస్, రెజీనాలతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?

ఆరుషి వర్మ : ఒకసారి వాళ్ళు సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక వాళ్లకు ఉన్న ఇమేజ్ ను పక్కన పెట్టేసి, తమ పాత్ర కోసం ఎంతో కష్టపడతారు. నేను ఓ కొత్త నటిని అనే భావన లేకుండా ఎంతో ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు. నేను అనే కాదు.. ఎంతో మంది నటీనటులు ఉన్నారు.. అందరినీ వాళ్ళు నన్ను ట్రీట్ చేసినట్టే చేయడం ఆశ్చర్యంగా అనిపించింది.సీనియర్స్ అనే ఫీలింగ్ వాళ్ళకి లేదు. నన్ను ఓ కో ఆర్టిస్ట్ గానే వాళ్ళు ట్రీట్ చేశారు. వాళ్లలో అది నాకు బాగా నచ్చింది. అలాగే వాళ్ళలా హార్డ్ వర్క్ చేస్తేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది అనే విషయం కూడా నాకు అర్థమైంది.

‘శాకిని డాకిని’ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనేది కొరియన్ మూవీ మిడ్ ‘నైట్ రన్నర్స్’ కి రీమేక్ కదా? తెలుగులో స్టార్ట్ అయ్యే ముందు మీరు సినిమాని చూశారా?

ఆరుషి వర్మ : యెస్..! చూశాను ఇది మంచి సబ్జెక్ట్. అయితే తెలుగులో ఇంకా బాగా తీశారు. అలా అని ఒరిజినల్ ను తక్కువ చేయడం లేదు. వాళ్ళ స్టైల్లో అది బ్యూటిఫుల్. మన స్టైల్ లో ఇది బ్యూటిఫుల్.

దర్శకుడు సుధీర్ వర్మతో పనిచేయడం ఎలా అనిపించింది?  

ఆరుషి వర్మ : ఆయన చాలా గొప్ప డైరెక్టర్. నటీనటులను ఆయన ట్రీట్ చేసే విధానం చాలా బాగుంటుంది. అందరినీ కంఫర్ట్ జోన్ కు తీసుకొచ్చాకే షాట్ కు రెడీ అవుతారు. అలాగే సెట్స్ లో ఆయన అన్నీ గమనిస్తారు.ఆయన అందరికంటే ముందుగా సెట్స్ కు వస్తారు. అందరికంటే లాస్ట్ వెళ్తారు.(నవ్వుతూ) ఇలాంటి డైరెక్టర్ తో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

‘శాకిని డాకిని’ బాక్సాఫీస్ రిజల్ట్ తో మీరు ఎంతవరకు సంతృప్తి చెందారు?

ఆరుషి వర్మ : రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. నాకు మంచి పాత్ర దొరికింది. తెలుగులో నాకు మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీగా నేను దీన్ని భావిస్తున్నాను.

భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?

లీడ్ రోల్స్ కావాలి అని నేను పట్టుబట్టి కూర్చోలేదు. కథకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేయాలని ఉంది.

టాలీవుడ్ పై మీ అభిప్రాయం ఏంటి?

ఆరుషి వర్మ : టాలీవుడ్లో రూపొందే సినిమాల్లో ఇంకా ఇంకా నటించాలని ఉంది. ఇక్కడి దర్శకనిర్మాతలు సినిమా అంటే ప్రాణంగా పనిచేస్తున్నారు. తెలుగులో చాలా మంచి సినిమాలు రూపొందుతున్నాయి.

టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్లు  ఎవరు?

హీరోల్లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోను. తెలుగు సినిమా రేంజ్ ను పెంచింది అల్లు అర్జున్ అని నేను భావిస్తాను.సౌత్ లో నెంబర్ వన్ హీరో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అతని డ్యాన్స్, వాక్, స్టైల్ అన్నీ నాకు చాలా నచ్చుతాయి. అతనంటే నాకు క్రష్ ఫీలింగ్ ఉంది. ఇక హీరోయిన్లలో నాకు సమంత, అనుష్క అంటే ఇష్టం.

మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?

తెలుగు డైరెక్టర్.. 7 భాషల్లో తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. ప్రస్తుతానికి దాని గురించి నేను ఏమీ చెప్పలేను. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఓటీటీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus