బండ్ల గణేష్ పై మరో మారు విమర్శలు గుప్పించిన సచిన్ జోషి
- March 27, 2017 / 11:45 AM ISTByFilmy Focus
ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్, హీరో సచిన్ జోషిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిర్మాతగా మారిన తర్వాత గణేష్ సచిన్ తో కలిసి ‘నీ జతగా నేనుండాలి’ అనే సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఫెయిల్ అయింది. ఇద్దరికీ నష్టాలను మిగిల్చింది. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వార్ మొదలయింది. రీసెంట్ గా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూ లో సచిన్ జోషిని అవమానిస్తూ మాట్లాడారు. అతనిని నటించిన సినిమాలకు లాభాలు కూడా వస్తాయా? అంటూ హేళన చేశారు. దానిపై సచిన్ ఈ రోజు స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “బండ్ల గణేష్ పెద్ద ఇడియట్. గణేష్ పై 14 చెక్ బౌన్స్ కేసులున్నాయి. అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడో అతన్ని జైలుకి పంపించేవాణ్ణి. కానీ బండ్ల తండ్రి నా వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకోవడంతో అతన్ని జైలుకు పంపంకుండా వదిలాను” అని చెప్పారు. మరి ఈ మాటలపై బండ్ల గణేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













