కొన్ని సినిమాల విలువ విడుదలైనప్పుడు తెలియదు, అర్ధం కాదు కూడా. కానీ.. కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత మాత్రం క్లాసిక్ అనే ట్యాగ్ వేసి తెగ పొగిడేస్తుంటాం. అలాంటి సినిమాల్లో చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన “అనుకోకుండా ఒకరోజు” ప్రప్రధమ స్థానం సొంతం చేసుకొంటుంది. ఆ సినిమా కథ, ఛార్మీ నటన ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంటుంది. గుడ్డి నమ్మకాల మీద చంద్రశేఖర్ ఏలేటి వేసిన సెటైర్ ను చాలా మంది అప్పటికే కాదు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పుడు అదే ఫార్మాట్ ను బేస్ చేసుకొని రెండు హిందీ వెబ్ సిరీస్ లు రూపొందాయి. “లైలా” అనే వెబ్ సిరీస్ మెయిన్ థీమ్ హిందూ ధర్మాన్ని బేస్ చేసుకొని ఒక సపరేట్ సామ్రాజ్యాన్ని నడిపించే రాజకీయనాయకుడు ఈ దేశాన్ని ఎలా శాసించాడు అనేది కథాంశం. అలాగే.. ఇప్పుడు హాట్ టాపిక్ అయిన “సేక్రెడ్ గేమ్స్” సీజన్ 2 మూల కథ కూడా “అనుకోకుండా ఒకరోజు” చిత్రాన్ని గుర్తుచేస్తుంది. ఇప్పుడు ఈ ఆరు గంటల సెకండ్ సీజన్ ను ఆహో ఓహో అని ఆదరిస్తున్న ప్రేక్షకులు “అనుకోకుండా ఒకరోజు” చిత్రాన్ని యావరేజ్ గా ఎందుకు తీర్పునిచ్చారో అర్ధం కాని ప్రశ్న. ఏదేమైనా పదేళ్ళ క్రితమే ఇంత అడ్వాన్స్డ్ గా ఆలోచించి కథలు రాసుకొన్న చంద్రశేఖర్ ఏలేటిని మెచ్చుకోవాల్సిందే.