స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సందీప్ మాధవ్ ‘గంధర్వ’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

‘వంగవీటి, ‘జార్జిరెడ్డి’ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకాల‌పై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ‘గంధర్వ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఇండియ‌న్ సినిమాల్లో రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు అప్స‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌ని ఓ డిఫ‌రెంట్ రోల్‌లో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారు. ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో సందీప్ మాధ‌వ్ రౌడీల‌ను చిత‌క్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి క‌ట్టేయ‌బ‌డి ఉన్నాయి. ఇవ‌న్నీ చూస్తుంటే గంధ‌ర్వ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని తెలుస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. నాగు.వై ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.

ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరంజ‌న్ జె.రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus