మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా… వై.వి.ఎస్ చౌదరి డైరెక్షన్లో తెరకెక్కిన ‘రేయ్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మరాఠీ బ్యూటీ సయామీ ఖేర్. నిజానికి సాయి తేజ్ మొదటి చిత్రంగా ‘రేయ్’ విడుదల కావాల్సినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం మొదట విడుదలయ్యింది. అయితే లేట్ రిలీజ్ అవ్వడం వలనో ఏమో కానీ ‘రేయ్’ చిత్రం సక్సెస్ కాలేదు. దీంతో సయామీ ఖేర్ కు తెలుగులో అవకాశాలు రాలేదు.
అయితే హిందీలో మాత్రం.. ‘మిర్జ్యా’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అనిల్ కపూర్ కొడుకు హర్ష వర్ధన్ కపూర్ మొదటి చిత్రం ఇది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కూడా ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే రెండు ప్రాజెక్ట్ లు ఈమెను వెతుక్కుంటూ వచ్చాయట. కానీ ‘మిర్జ్యా’ చిత్రం ప్లాప్ అవ్వడంతో.. ఈమె సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్ ల నుండీ ఈమెను తీసేసారట. ఆ విషయాన్ని స్వయంగా సయామీనే చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. ” ‘మిర్జ్యా’ తర్వాత నేను రెండు సినిమాలకు సైన్ చేశాను. కానీ ఆ సినిమాల్లో నటించలేదు. ‘మిర్జ్యా’ ప్లాప్ అవ్వడంతో ఆ చిత్రాల నుండీ నన్ను తీసేసారు. అందులో ఒకటి దర్శకుడు మణిరత్నం చిత్రం కూడా ఉంది. నా ప్లేస్ లో వేరే హీరోయిన్ ను తీసుకున్నారు. సినీ పరిశ్రమ అలాంటిది మరి…! ఇక్కడ రాణించడం చాలా కష్టం. ఇక్కడ ఉండాలంటే గుండెను కఠినంగా మార్చుకోవాలి. నేను క్రీడాకారిణి కాబట్టి.. ఇప్పటికే నాకు అలాంటి స్వభావం ఉంది. దేన్నైనా తట్టుకోగల క్రమశిక్షణ నాలో ఏర్పడింది” అంటూ సయామీ ఖేర్ చెప్పుకొచ్చింది.