మెగా మేనల్లుడు సాయి తేజ్ కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లందుకుని… తరువాత ఆ హిట్లకు రెండింతల ప్లాపులని అందుకున్నాడు. అయినా ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వకుండా ‘చిత్రలహరి’ తో డీసెంట్ హిట్టందుకున్నాడు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్లో ‘ప్రతీరోజు పండగే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉండగా తేజుకి… ఎక్కువ శాతం తన మావయ్యలు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోలికలు వచ్చాయని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకొస్తుంటారు. పోలికలలో మాత్రమే కాదు… వారి బాటలోనే సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు.
ఇందులో భాగంగా.. తేజు ఇటీవల 100 మంది పిల్లలున్న ఓ స్కూల్ ను దత్తత తీసుకున్నాడట. ‘థింక్ పీస్’ అనే ఆర్గనైజేషన్ లో తేజు పార్టనర్. మున్నిగూడలోని అక్షరాలయ అనే స్కూల్ ను వారితో కలిసి సాయి తేజ్ రెండేళ్ళ పాటు సేవలు అందించబోతున్నాడట. పిల్లలకు అవసరమైన పోషకాహారాలతో పాటు ఇతర అవసరాలని తేజు తీర్చనున్నాడట. తన సోషల్ మీడియా ద్వారా… తేజ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అభిమానులు కూడా తోచిన విధంగా విరాళాలు అందించాలని కోరాడు. రెండేళ్ళ పాటు ఈ స్కూల్ లో సేవ కార్యక్రమాలు కొనసాగుతాయని…. ఈ ఏడాది మరో 50 మంది పిల్లలని కూడా దత్తత తీసుకోబోతున్నట్లు’ తేజు తెలిపాడు.