మెగా హీరో సినిమాకు ఎన్టీఆర్ సాయం.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. ఇకపోతే ఈ సుప్రీం హీరో తాజాగా కొత్త సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ నటించిన ఈ సినిమా నుంచి డిసెంబర్ 7వ తేదీ ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మేకర్స్ అధికారిక వెబ్సైట్ నుంచి ఈ విషయాన్ని తెలియజేశారు.

ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని వార్తలు వచ్చాయి అయితే ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇదే విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ ఒక గాంబీర్యమైన తారక్ వాయిస్ తో ఈ టైటిల్ ఫస్ట్ లుక్ ఉంటుందని పేర్కొన్నారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ ఖరారు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

విరూపాక్ష అంటే శివుడి రూపం అనే అర్థం వస్తుంది. మరి ఇందులో సాయి ధరంతేజ్ పాత్ర కూడా అదే తరహాలో ఉండబోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ అదిరిపోయిందని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు అందరూ కూడా ఆధ్యాత్మిక కోణంలో ఉన్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఇలాంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ కావడంతో చాలామంది ఇలాంటి సినిమాలను చేయడానికి మక్కువ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇలా ఆధ్యాత్మిక కోణంలో వచ్చిన సినిమాలు మంచి హిట్ కావడంతో సాయి తేజ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారని పలువురు భావిస్తున్నారు.మరి ఈ సినిమా టైటిల్ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరొక రెండు రోజులు వేచి ఉండాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus