తేజు సినిమా సంక్రాంతికి రావడం లేదు… కానీ..?

వరుసగా అరడజన్ ప్లాపుల తర్వాత ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్టందుకున్నాడు సాయి తేజ్. అయితే ఇది పెద్ద హిట్టేమీ కాదు. దీంతో తరువాతి సినిమాతో సాలిడ్ హిట్టందుకోవాలని సంక్రాంతిని టార్గెట్ చేశాడు. మారుతీ డైరెక్షన్ లో ‘ప్రతీరోజూ పండగే’ అనే చిత్రాన్ని సెట్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ విషయంలో మారుతీ సిద్ధహస్తుడు. అందుకే ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ మహేష్ బాబు, అల్లు అర్జున్, రజినీ కాంత్ వంటి బడా హీరోల సినిమాలు అదే టైములో రానుండడంతో ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం…. 2019 క్రిస్టమస్ కే ‘ప్రతీరోజూ పండగే’ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఆంటే ప్రీ పోన్ అయినట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి సగం షూటింగ్ పూర్తయ్యింది. అతి త్వరలో ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారట. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అదే రోజున మెగా అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వాలని తేజు, మారుతీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసి ‘క్రిస్టమస్’ కానుకగా విడుదల చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారట. ఇక ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘సుప్రీమ్’ చిత్రం సూపర్ హిట్టయ్యింది. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘జిఏ2 పిక్చర్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus