Sai Dharam Tej: నేటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సాయి తేజ్!

నిహారిక ప్రస్తుతం తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నారు. అయితే భర్త నుంచి విడిపోయినటువంటి ఈమె తన వృత్తిపరమైన జీవితంలో సక్సెస్ సాధించడానికి పెద్ద ఎత్తున కష్టపడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల విమర్శలు వస్తూనే ఉంటాయి. నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇకపోతే తాజాగా నిహారిక పర్సనల్ లైఫ్ గురించి నేటిజన్ కామెంట్ చేయడంతో మెగా హీరో సాయి ధరంతేజ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతూ సదరు నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. నవీన్ విజయకృష్ణ కోసం ఓ ప్రయివేట్ సాంగ్ లో నటించాడు. స్వాతి రెడ్డితో కలసి సత్య అనే వీడియో సాంగ్ లో నటించారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సాంగ్ అప్డేట్ ఇస్తూ తేజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఈ సాంగ్ గురించి నిహారిక స్పందిస్తూ ఈ సాంగ్ కోసం తాను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ కామెంట్ చేశారు. అయితే నిహారిక చేసిన ఈ కామెంట్ పై నేటిజన్ కామెంట్ చేశారు. వీటి పైన నువ్వు పెట్టిన ధ్యాస నీ పర్సనల్ లైఫ్ పై పెట్టి ఉంటే బాగుండేది అంటూనే హారిక వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావనకు తీసుకోవచ్చారు. ఇలా నిహారిక పర్సనల్ లైఫ్ గురించి నేటిజెన్ కామెంట్ చేయడంతో కోపంతో మండిపోయిన సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) నోరు మూసుకో..

వెంటనే కామెంట్ డిలీట్ చెయ్ అంటూ ఆ ఆకతాయికి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చాడు. ఇలా తేజు రియాక్ట్ అవ్వడంతో ఆయన అభిమానులు కూడా సదరు నెటిజన్ పై విమర్శలు చేస్తున్నారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus