చిరు కోసం మరో రైటర్!

చిరంజీవి ప్రస్తుతం తన 150 సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ అఫీషియల్ రైటర్స్. అయితే వీరు కాకుండా ఇప్పుడు మరో రైటర్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఎన్నో హిట్ చిత్రాలకు పని చేసిన సాయి మాధవ్ బుర్రాను ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రాయమని సంప్రదించారంట. ఆ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.

ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు అసెట్ గా నిలుస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చిరంజీవిపై సినిమా పతాక సన్నివేశాలను చిత్రీకరించారట. ఆ సీన్స్ లో నటించేప్పుడు చిరు బాగా ఎమోషనల్ అయినట్లుగా సమాచారం. రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి చిరు ఈ అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతాడో చూడాలి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus