అమ్మాయిలు అలాంటి బట్టలు వేసుకోవాలి.. ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనే రూల్స్ పెట్టడానికి బయట వాళ్లకి ఏం హక్కు ఉంది. న్యాయస్థానమే అమ్మాయిలు కూడా వాళ్లకి నచ్చినట్టు ఉండొచ్చు అని ఆదేశించింది. ఫెమినిజాన్ని కూడా సపోర్ట్ చేసింది. అయినప్పటికీ ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి అంతా ఏదో ఒక నెగిటివ్ కామెంట్ విసురుతూనే ఉన్నారు. కాదు కాదు విసురుతూనే ఉన్నాం.
అమ్మాయిల డ్రెస్సింగ్ ను బట్టి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేయడం అనేది కూడా ఎథికల్ గా ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనేది కూడా ఒప్పుకోవాల్సిన నిజం. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళ గురించి ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే సెలబ్రిటీలను.. ముఖ్యంగా సినిమా వాళ్ళను ఆడియన్స్ పర్సనల్ గా తీసుకుంటారు. అక్కడే వస్తుంది సమస్య అంతా..!
సరే ఇక అసలు విషయానికి వెళ్ళిపోదాం. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ తన సోదరి పూజా కన్నన్ తో కలిసి బికినీలో దర్శనమిచ్చి అందరినీ షాక్ కి గురిచేసింది. దీంతో సాయి పల్లవిని అభిమానించే వారు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళని ట్యాగ్ చేసి మరికొందరు నెటిజెన్లు నెగిటివ్ కామెంట్లు విసురుతున్నారు.
ఇవన్నీ ఎందుకు.. అంటే ఆన్సర్ చాలా సింపుల్. ‘సాయి పల్లవి స్కిన్ షోకి చాలా దూరంగా ఉంటుంది’ అనే నమ్మకాన్ని అభిమానులకు మొదట్లోనే క్రియేట్ చేసింది సాయి పల్లవి. భారీగా పారితోషికాలు ఇస్తామని ఆఫర్లు ఇచ్చినా వాటన్నిటినీ రిజెక్ట్ చేసింది కూడా. అలాంటి సాయి పల్లవి సడన్ గా ఇలా బోల్డ్ గా కనిపించే సరికి ఎవరికి తోచిన ఆన్సర్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు.
Unexpected #SaiPallavi in Bikkini #SaiPallaviHot pic.twitter.com/D0rBK1D8nh
— Cinema Koodam (@cinemakoodam) September 21, 2025