Sai Pallavi: చెల్లెలు బర్త్ డే ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి పల్లవి.. మనిషిగా నన్ను మార్చింది తనే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఫిదా సినిమా ద్వారా హీరోయిన్గా వచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో డాన్సులతో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి నటి సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే. ఇలా మొదటి సినిమాతోనే ప్రేక్షకులు అందరిని మెప్పించిన ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.ఇక సాయి పల్లవి వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా ఎలాంటి గ్లామర్ షో లేకుండా కథకు చాలా ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నారు.

ఇక తనకు ఇష్టం లేకపోయినా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన, స్టార్ హీరోలైన నిర్మొహమాటంగా ఆ సినిమాలలో నటించినని చెప్పేస్తారు. ఇలా ఆచితూచి ఇండస్ట్రీలో అడుగులు వేస్తూ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి చివరిగా గార్గి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈమె ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.

ఇలా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడంతో ఈమె ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలు గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.సాధారణంగా సాయిపల్లవి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు అయితే తాజాగా తన చెల్లెలు పూజ కన్నన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలను వీడియోగా చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా తన చెల్లెలు గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే తన చెల్లెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే మై మంకీ.. మంచి సోదరి కావాలనే తపనతో నన్ను మనిషిగా మార్చి ఎన్నో విషయాలను నేర్పించావు. నా సంతోషానివి, నా ప్రేమ నువ్వే థాంక్యూ చెల్లి ఐ లవ్ యు అంటూ ఈమె పోస్ట్ చేశారు. అయితే తన అక్క చేసినటువంటి ఈ పోస్ట్ చూసిన పూజ రిప్లై ఇస్తూ ఓ మై గాడ్ ఐ లవ్ యు సో మచ్… మిస్ యు అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సాయి పల్లవి షేర్ చేస్తున్న ఈ వీడియో వైరల్ అవుతుంది.


విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus