Sai Pallavi: ఆ పాత్రలో నటించడానికి సాయిపల్లవి ఓకే చెప్పారా?

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పుష్ప ది రూల్ ఆ సినిమాను మించి సక్సెస్ సాధించేలా సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పుష్ప ది రైజ్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిన నేపథ్యంలో పుష్ప ది రూల్ ఆ సినిమాకు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పుష్ప ది రైజ్ లో రష్మిక హీరోయిన్ గా నటించగా పుష్ప ది రూల్ లో రష్మికతో పాటు సాయిపల్లవి కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని సాయిపల్లవి పుష్ప ది రూల్ సినిమాలో గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. అయితే సాయిపల్లవి పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్నారని అధికారికంగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సాయిపల్లవి ముందువరసలో ఉంటారు. స్టార్ హీరోల సినిమాలలో మంచి పాత్రలలో నటించాలని సాయిపల్లవి భావిస్తున్నారు. సుకుమార్ లేదా పుష్ప మేకర్స్ స్పందిస్తే మాత్రమే సాయిపల్లవి ఈ సినిమాలో భాగమయ్యారో లేదో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ మూవీ 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్, సుకుమార్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ అయ్యాయని త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus