Sai Pallavi: ఆ కారణంతోనే పెళ్లి వాయిదా వేసుకున్నాను: సాయి పల్లవి

ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే తన నటనతో అందరిని ఫిదా చేసేసింది దీంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి సాయి పల్లవి పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సాయి పల్లవి (Sai Pallavi) చెల్లెలు పూజా కన్నన్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తనకంటే ముందుగానే తన చెల్లెలు పెళ్లి చేసుకుంటున్నటువంటి తరుణంలో ఈమె గతంలో పెళ్లి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 23 సంవత్సరాలు వచ్చే సమయానికి పెళ్లి చేసుకోవాలని 30 సంవత్సరాలలోపు పిల్లల్ని కూడా కనాలని అనుకున్నాను కానీ అప్పుడు ఎంబిబిఎస్ చదువుతున్నాను.

ఎంబిబిఎస్ పూర్తి కాగానే నాపై కొన్ని బాధ్యతలు పడ్డాయి ఆ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలోనే పెళ్లిని వాయిదా వేసుకున్నాను. ఇలా నా పెళ్లి వాయిదా పడటంతో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చానని ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ కావడంతో పెళ్లిని మరికొద్ది రోజులపాటు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి పెళ్లి గురించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus