శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత కణం, ఎం.సి. ఎ, పడి పడి లేచె మనసు, మారి2, ఎన్జికే వంటి చిత్రాల్లో నటించింది. తన నటనతో పాటు డాన్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్లామర్ షో కు దూరంగా ఉంటూ కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఈమె ఎంపిక చేసుకుంటూ పోతుంది. ఎక్కువగా సంపాదించుకోవాలి.. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఆలోచనలో సాయి పల్లవి లేదు.
మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలను మాత్రమే చేస్తాను. లేదంటే మెడిసిన్ చదువుకున్నాను కాబట్టి ఏదైనా జాబ్ చేసుకుంటాను అంటూ చెప్పుకొస్తుంది సాయి పల్లవి. ఇక అసలు విషయంలోకి వస్తే… ఈ మూడు సంవత్సరాల్లో ఈమె ఏకంగా రూ.5 కోట్లు వదులుకుందట. ఎలా అంటారా? .. సాయి పల్లవి ప్రస్తుతం సినిమాకి వచ్చి రూ.80 లక్షల నుండీ రూ.1 కోటి వరకూ పారితోషికం తీసుకుంటుంది అని తెలుస్తుంది. అయితే ఈమె గత 3 ఏళ్ళలో ఈమె డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు,
అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాదన్(రీమేక్) వంటి సినిమాలు రిజెక్ట్ చేసిందట. ఇవన్నీ భారీ సినిమాలు కాబట్టి ఆమెకు కోటి పైనే పారితోషికం ఇస్తాము అని నిర్మాతలు ఆఫర్ ఇచ్చారట. కానీ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అని భావించి ఆమె రిజెక్ట్ చేసిందట. అంతే 5,6 యాడ్స్ వంటి వాటిలో ఆఫర్ వస్తే వాటిని కూడా రిజెక్ట్ చేసిందట. సో వీటి విలువ మొత్తం కలిపి రూ.5 కోట్లు పైనే ఉంటుందని ఈమె సన్నిహిత వర్గాల సమాచారం.