మరోసారి తన మంచితనాన్ని చాటుకున్న మల్లుబ్యూటీ

మన సౌత్ ఇండియాలో స్వీటెస్ట్ హీరోయిన్ అంటే ఇమ్మీడియట్ గా అందరికీ అనుష్క గుర్తొస్తుంది కానీ.. మెలమెల్లగా ఆ ప్లేస్ ను రీప్లేస్ చేస్తోంది సాయిపల్లవి. అమ్మడు హీరోలతో సరిగా బిహేవ్ చేయదని మధ్యలో టాక్ వినిపించినప్పటికీ.. శర్వానంద్ ఆ రూమర్స్ అన్నిట్నీ స్మాష్ చేసి పడేసి.. సాయి పల్లవి స్వీటెస్ట్ హీరోయిన్ అని తేల్చిపాడేశాడు. “పడి పడి లేచే మనసు” సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ.. ఆ సినిమాలో అమ్మడి పెర్ఫార్మెన్స్ కి మాత్రం చాలా మంచి పేరొచ్చింది. అయితే.. హీరోలతో కెమిస్ట్రీ పండించే విషయంలో మాత్రమే కాదు నిర్మాతలకు డబ్బులు మిగల్చడంలోనూ సాయిపల్లవి సూపరట.

ఆమె తాజా చిత్రం “పడి పడి లేచే మనసు” బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలైన విషయం తెలిసిందే. దాదాపు 30+ కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించబడిన ఈ చిత్రానికి దాదాపు 20 కోట్ల నష్టం వచ్చింది. అయినప్పటికీ.. నిర్మాతలు తమకు వచ్చిన నష్టాన్ని బేరీజు వేసుకోకుండా.. సాయిపల్లవికి పెండింగ్ రెమ్యూనరేషన్ ను చెక్ రూపంలో పంపారట. అయితే.. రిజల్ట్ గురించి, వచ్చిన నష్టాల గురించి తెలిసిన సాయిపల్లవి ఆ చెక్ ను మళ్ళీ నిర్మాతలకు రిటర్న్ ఇచ్చిందట. ఒక హీరోయిన్ ఇలా సినిమాకి రిజల్ట్ కు బాధ్యతవహిస్తూ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయడం అనేది బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. అందుకే సాయిపల్లవి ఇప్పుడు స్వీట్ హీరోయిన్ ఆఫ్ సౌత్ ఇండియా అయిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus