అసలు పెళ్లే చేసుకోను

ఎవరైనా హీరోయిన్ ని మీ పెళ్ళెప్పుడు అని ప్రశ్నిస్తే.. ‘దానికి ఇంకా టైమ్ ఉందనో, త్వరలోనే చెబుతాననో, చేతినిండా సినిమాలున్నాయనో, మనసుకి నచ్చిన వ్యక్తి తారసపడలేదనో’ చెబుతారు. కెమెరా ముందుకి వచ్చిన ముద్దుగుమ్మలు ఎంతమంది మారుతున్నా పెళ్లి విషయంలో వారిచ్చే ఈ రకమైన సమాధానాలు మాత్రం మారవు. అయితే దీనికి భిన్నంగా ఏకంగా పెళ్ళి చేసుకోను అని తెగేసి చెబుతోంది ఓ బ్యూటీ. ఆమె ఎవరో తెలుసా..?

‘ప్రేమమ్’ సినిమాతో యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న సాయి పల్లవి. మలర్ పాత్రలో అంతలా ఇమిడిపోయిన సాయి పల్లవికి మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అని యధాలాపంగా ప్రశ్న ఎదురైందట. దానికి బదులుగా ‘నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు’ అని దిమ్మదిరిగిపోయే సమాధానం ఇచ్చిందట. అదీ అమ్మడు వరుస. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘ప్రేమమ్’, ‘ఖాళీ’ అనే మలయాళ సినిమాల నటించిన సాయి పల్లవి శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంటరవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus