టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సాయి పల్లవి ఒకరు. ఈమె ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ విధంగా హీరోయిన్ గా వరుస భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన నటిస్తున్నారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం తండేల్.
ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మరోసారి సాయి పల్లవి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థపు ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలలో సాయి పల్లవి సిస్టర్స్ ఇద్దరు ధరించిన చీరలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
దీంతో వీరు కట్టుకున్న ఈ చీరలు ధర ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ వేడుకలో సాయి పల్లవి కట్టుకున్నటువంటి చీర ఖరీదు 50 వేలు అని తెలుస్తుంది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ఈ చీర 50 వేల విలువ అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
లేత ఆకుపచ్చ రంగులు ఉన్నటువంటి ఈ చీరలో సాయి పల్లవి (Sai Pallavi) ఎంతో అందంగా కనిపిస్తున్నారు ఈ పెళ్లి వేడుకలలో ఈమె వేసినటువంటి తీన్మార్ స్టెప్పులకు సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక సాయి పల్లవి తండేల్ సినిమాతో పాటు తమిళ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!