తమిళ అందాల భామ అయిన సాయి పల్లవి.. ‘ఫిదా’ సినిమాతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి. ‘ఫిదా’ సినిమాలో చక్కగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తన డైలాగ్ డెలివరితో అందమైన నటనతో అందర్ని కట్టిపడేసింది. సాయి పల్లవి చేసిన సినిమాలు కొన్నే అయిన.. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. హావ భావాలను చక్కగా ప్రదర్శించగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ భామ క్రేజ్‌ను చూసిన ‘డియర్ కామ్రేడ్’ దర్శక నిర్మాతలు మొదట సాయి పల్లవినే విజయ్ సరసన హీరోయిన్‌గా తీసుకొవాలని అనుకున్నారట.
అందులో భాగంగా సాయిపల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో లిప్‌లాక్ సీన్లు ఉండటంతో సాయి పల్లవి ‘డియర్ కామ్రెడ్’లో నటించేందుకు ఒప్పుకోలేదట. ముద్దు సీన్లలో తనకు నటించడం అసౌకర్యంగా ఉంటుందని.. అందుచేత విజయ్‌తో ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. దీంతో అప్పటికే ‘గీత గోవిందం’ తో సూపర్ హిట్ వచ్చిన రష్మికను తీసుకున్నారట చిత్ర బృందం. అయితే ఈ ప్రచారంపై హీరోయిన్ సాయిపల్లవి, ‘డియర్ కామ్రేడ్’ చిత్ర బృందం ఇప్పటి వరకు స్పందించలేదు.
డియర్ కామ్రేడ్ విడుదల అయిన 24 గంటల్లోనే యూట్యూబ్ లో 11 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిందట. డియర్ కామ్రేడ్ టాలీవుడ్ తో పాటు మిగతా మూడు భాషల్లో కూడా భారీ అంచనాలతో విడుదలయిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలను అందుకోలేక ఆ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. రన్ టైం పెద్ద మైనస్ అయితే అసలు కాన్సెప్ట్ ఎవరికీ అర్థం కాకపోవడం, సినిమా చూసినోళ్ళకి నీరసం రావడం మరోమైనస్.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు