Sai Pallavi sister Pooja Kannan: పూజా కన్నన్‌ కొత్త సినిమా ఇదే..!

Advertisement

దక్షిణాదిలో సాయిపల్లవి క్రియేట్‌ చేసిన ఇంపాక్ట్‌ అలాంటిలాంటిది కాదు. స్కిన్‌షో, గ్లామర్‌ ఒలకబోత ఉంటేనే స్టార్‌ నాయిక గుర్తింపు వస్తుందనుకుంటున్న నేటి రోజుల్లో వాటన్నింటికీ దూరంగా ఉంటూ ఆ ఇమేజ్‌ సంపాదించుకుంది. అందుకే ఆమెకు ఇప్పుడు సౌత్‌లో అంత క్రేజ్‌. ఆ క్రేజ్‌కు పోటీ ఇవ్వడానికి అదే కుటుంబం నుండి మరో నాయిక వస్తోంది. అవును సాయిపల్లవి సోదరి పూజా కన్నన్‌ డెబ్యూ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. పూజా కన్నన్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా ఉంది అంటూ చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి.

అయితే ఆ తర్వాత పెద్దగా ఆ మాటలు వినిపించలేదు. ఇప్పుడు ఏకంగా సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో తీసుకొస్తున్నారు. జీ5 ఓటీటీలో ఈ సినిమాను డిసెంబరు 3న రిలీజ్‌ చేస్తున్నారు. ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ శివ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. సముద్రఖని మరో ముఖ్య పాత్రలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విజయ్‌ ఇటీవల ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

సముద్రఖని, పూజా కన్నన్‌ సైకిల్‌ మీద ఆనందంగా విహరిస్తున్నట్లు ఆ పోస్టర్‌ రూపొందించారు. దీన్ని చూస్తుంటే సినిమా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. మరి సాయిపల్లవి చూపించిన ప్రభావం… పూజా కన్నన్ చూపిస్తుందో లేదో చూడాలి. అన్నట్లు సినిమా పేరు చెప్పలేదు కదా… ‘చిత్తిరాయి సెవ్వనం’.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus