Sai Pallavi, Mahesh Babu: అదే నిజమైతే కొత్త మహేష్‌ను చూస్తారు!

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. #SSMB28 అంటూ ఓ వీడియో కూడా ఆ మధ్య రిలీజ్‌ చేశారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సినిమా ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది. అయితే సినిమా మీద బజ్‌ మాత్రం అలానే ఉంది. కారణం 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుస్తుండటం. ‘ఖలేజా’ తర్వాత ఇదే వారి ఇద్దరి కాంబోలో నెక్స్ట్‌ సినిమా. అయితే ఈ సినిమాకు ఇప్పుడు మరొక యాడ్‌ ఆన్‌ కలుస్తోందట. అది కూడా మామూలు యాడ్‌ ఆన్‌ కాదు… హైబ్రిడ్‌ యాడ్‌ ఆన్‌.

హైబ్రిడ్‌ అంటున్నారు… ఏంటి ఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారా? అని అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. హీరోయిన్‌ విషయంలో ఎలాంటి మార్పు లేదు. పూజా హెగ్డేనే మహేష్‌తో నటిస్తోంది. అయితే సాయిపల్లవిని మహేష్‌కి సోదరి పాత్ర కోసం అడిగారట. ఆమె కూడా ఈ ఆఫర్‌ విషయంలో సంతృప్తిగానే ఉందని టాక్‌. త్వరలోనే సినిమా గురించి అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాలో హీరో, సోదరి పాత్రలకు సమానమైన వెయిటేజీ ఉంటుందట.

త్రివిక్రమ్‌ సినిమాల్లో హీరోయిన్లు ఇలా వచ్చి, అలా వెళ్లేలా ఉండదు. సినిమా సాంతం ముడి పడే ఉంటుంది. అంతేకాదు ముఖ్యమైన పాత్రలు కూడా అలానే ఉంటాయి. ఈ కారణం చేతనో లేక మహేష్‌ బాబు సినిమా అనో సాయిపల్లవి సోదరి పాత్రకు ఓకే చెప్పింది అంటున్నారు. గతంలో మహేష్‌ అన్నాచెల్లెళ్ల కాంబినేషన్‌లో చేసిన సినిమా ‘అర్జున్‌’కు మంచి పేరొచ్చింది. అందులో సోదరి పాత్ర వేసిన కీర్తి రెడ్డికి కూడా మంచి పేరే వచ్చింది.

ఇప్పుడు సాయిపల్లవి పాత్ర కూడా అలానే పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అయితే చిరంజీవి సరసన సోదరి పాత్ర అంటే నో చెప్పిన సాయిపల్లవి ఇప్పడు మహేష్‌కు ఓకే చెబుతుందా అంటే అవుననే చెప్పాలి. ఆమెకు చెల్లి పాత్రతో సమస్య లేదు, రీమేక్‌లు అంటేనే సమస్య. ఈ మాటే ఆమే చెప్పింది. అయితే ఆ తర్వాత మాట మార్చింది అనుకోండి. ఇప్పుడు మహేష్‌కు సోదరి అవుతుందా? చూద్దాం ఏమవుతుందో?

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus