Sai Tej: చిరు, చరణ్ తో మల్టీస్టారర్ పై సాయితేజ్ క్లారిటీ ఇదే.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సాయితేజ్ (Sai Dharam Tej) విరూపాక్ష (Virupaksha) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా బ్రో (BRO)  సినిమాతో యావరేజ్ హిట్ ను అందుకున్నారు. ఇప్పటికే  (Pawan Kalyan) పవన్ కళ్యాణ్, నాగబాబులతో (Nagendra Babu) కలిసి వేర్వేరు సినిమాలలో నటించిన సాయితేజ్ (Chiranjeevi) చిరంజీవి నెక్స్ట్ టార్గెట్ అని చెబుతున్నారు. మీ కుటుంబంలో (Ram Charan) చరణ్ తో ఏదా ఇంకెవరితోనైనా మల్టీస్టారర్ చేస్తారా అనే ప్రశ్నకు సాయితేజ్ ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి మామతో కలిసి నటించాలని ఉందని సాయితేజ్ వెల్లడించారు.

చిరంజీవి గారితో కలిసి యాక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్లతో కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని సాయితేజ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో చిరంజీవి, సాయితేజ్ కాంబినేషన్ లో సినిమా రావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు సాయితేజ్ తన పేరును మార్చుకోవడం గమనార్హం. సాయి ధరమ్ తేజ్ నుంచి సాయితేజ్ గా పేరును మార్చుకోగా ఇప్పుడు ఆ పేరును సాయిదుర్గ తేజ్ గా మార్చుకున్నారు.

తన తల్లి ఎప్పుడూ తనతోనే ఉండాలనే ఆలోచనతో సాయితేజ్ పేరును మార్చుకున్నారని సమాచారం అందుతోంది. సాయితేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండగా సాయితేజ్ సంపత్ నంది కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. నిర్మాతల నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తే ఈ సినిమాకు సంబంధించిన సందేహాలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

సాయితేజ్ (Sai Tej) త్వరలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కావడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయితేజ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. సాయితేజ్ ఇతర భాషల్లో సైతం మరింత సత్తా చాటాలని పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus