సాయితేజ్ రేంజ్ పెరిగిందిగా.. రిలీజ్ కు ముందే అంత లాభమా?

సాయితేజ్ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ నటించిన తొలి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగాయి. సాయితేజ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి. వెస్ట్ గోదావరికి చెందిన ప్రవీణ్ ఈ సినిమా హక్కులను 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది.

భారీ ఆఫర్ కావడంతో నిర్మాత వెంటనే ఈ ఆఫర్ కు అంగీకరించారని బోగట్టా. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేసే చాలా అంశాల గురించి ప్రస్తావించారని తెలుస్తోంది. భోగవల్లి ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాత భోగవల్లి ప్రసాద్ కు ఈ మధ్య కాలంలో మంచి లాభాలను అందించిన సినిమా ఇదేనని తెలుస్తోంది. సాయితేజ్ సైతం ఈ సినిమా ఫలితం విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది.

భిన్నమైన కథలను ఎంచుకోవడం సాయితేజ్ కు ఒక విధంగా ప్లస్ అవుతోంది. ఈ సినిమాతో పాటు సాయితేజ్ వినోదయ సితం రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ కెరీర్ ప్లానింగ్ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయితేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

సాయితేజ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే ఆయన రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సాయితేజ్ వేగంగా సినిమాల్లో నటించాలని ఏడాదికి కనీసం రెండు సినిమాలను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో నిర్మాతకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో లాభం వచ్చిందని బోగట్టా.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus