Saiee Manjrekar: సరైన సక్సెస్ లేకపోయినా ఛాన్సులు కొట్టేస్తున్న స్టార్ కిడ్

ఎంత పెద్ద ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అయినా.. మొదటి సినిమాతో సక్సెస్ అందుకోకపోతే అవకాశాలు రావడం చాలా కష్టం. ఇది కొత్త విషయం కాదు. కానీ ఓ స్టార్ కిడ్ కి మాత్రం సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు సాయి మంజ్రేకర్. సయీ మంజ్రేకర్ …ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన మహేష్ మంజ్రేకర్ కూతురు. అతను తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

అతని కూతురి సాయి మంజ్రేకర్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జోడీగా ‘దబాంగ్ 3’లో నటించింది. అదే ఆమెకు డెబ్యూ మూవీ. అంత పెద్ద సినిమాతో ఎంట్రీ ఇస్తే .. సక్సెస్ గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో బాలీవుడ్ లో సాయి మంజ్రేకర్ కి అవకాశాలు రాలేదు. అయితే అదే టైంలో ఈమెకి తెలుగులో వరుణ్ తేజ్ ‘గని’ సినిమాలో నటించే ఛాన్స్ లభించింది. అది కూడా ఫ్లాప్ అయ్యింది.

అయినప్పటికీ ఆమెకు అడివి శేష్ హీరోగా మహేష్ నిర్మాణంలో రూపొందిన ‘మేజర్’ లో నటించే ఛాన్స్ లభించింది. ఇది మాత్రం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సక్సెస్ అయ్యింది. దీంతో ఆమె కెరీర్ ఇక సెట్ అయినట్టే అని అంతా అనుకున్నారు. అయితే ఇటీవల రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘స్కంద’ లో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది.

అది కూడా పెద్దగా ఆడలేదు. ఇలా ఈమెకు సక్సెస్ లు ఎక్కువ లేకపోయినా ఆఫర్లు అయితే వస్తున్నాయి. తాజాగా సాయి మంజ్రేకర్ కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 21 వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఆ రకంగా చూస్తే ఆమె (Saiee Manjrekar) అదృష్టవంతురాలు అనే చెప్పాలి

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus