ఎన్టీయార్ ని నటుడిగా ఒక పది మెట్లు ఎక్కించడమే కాక దర్శకుడిగా పూరీ జగన్నాధ్ కు పూర్వ వైభవం తెచ్చిపెట్టింది. ఆ సినిమా మీద ఏకంగా ఒక బుక్ కూడా రాశారంటే. కథ పరంగా “టెంపర్” ఏస్థాయి సంచలనం సృష్టించ్చిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్ హీరోలందరూ క్యూ కట్టారు. అయితే. రణవీర్ సింగ్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. “సింబా”గా రీమేక్ అవుతున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకుడు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తయిన ఈ చిత్రంలో కథానాయిక ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకూ వెల్లడించలేదు.
మొదట్లో కాజల్, సోనమ్ కపూర్ ల పేర్లు వినిపించినప్పటికీ. ఫైనల్ గా ఆ సదవకాశాన్ని సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ సొంతం చేసుకొందని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో తెరంగేట్రం కోసం వెయిట్ చేస్తున్న సారాకు ఈ చిత్రం మంచి ఎంట్రీ అవుతుంది. కరణ్ జోహార్ దగ్గరుండి మరీ సారాను బాలీవుడ్ కి పరిచయం చేస్తుండడంతో.. ఆమె ఏమాత్రం నటిగా ప్రూవ్ చేసుకొన్నా ఫ్యూచర్ స్టార్ గా ఎదిగే అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి.