Saif Ali Khan: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇచ్చిన మాటను సైఫ్ నిలబెట్టుకుంటారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ లో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. దేవర సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కు సైఫ్ అలీ ఖాన్ మాటిచ్చారని నార్త్ లో ప్రమోషన్స్ నేను చూసుకుంటానని సౌత్ లో ప్రమోషన్స్ నువ్వు చూసుకుంటే చాలని తారక్ కు సైఫ్ చెప్పినట్టు సమాచారం.

యంగ్ టైగర్ కు ఇచ్చిన మాటను (Saif Ali Khan) సైఫ్ అలీ ఖాన్ నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా కోసం 14 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని భోగట్టా. సైఫ్ అలీ ఖాన్ పాత్ర భయంకరంగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం లేదని సినిమా మాత్రం ఊహించని రేంజ్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కు ఈ సినిమాతో భారీ లాభాలు వచ్చేలా చేయాలని యంగ్ టైగర్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కొరటాల శివపై వచ్చిన విమర్శలు ఈ సినిమాతో ఆగిపోవాలని తారక్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఆచార్య మూవీ నెగిటివిటీకి చెక్ పెట్టేలా దేవర సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా సక్సెస్ సాధించగా దేవర సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus