Saikumar, Chiranjeevi: మెగాస్టార్ విమర్శకు సాయికుమార్ చెక్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ బిరుదును సంపాదించుకున్న చిరంజీవి రీఎంట్రీలో కూడా వరుస సక్సెస్ లు సాధిస్తూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ త్వరలో పూర్తి కానుండగా లూసిఫర్ రీమేక్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుంది. చిరంజీవి మరికొందరు దర్శకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాల షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయనే సంగతి తెలియాల్సి ఉంది. టాలెంటెడ్ నటుడు సాయికుమార్ తాజాగా చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రతిభతో సాయికుమార్ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్, సుమన్ లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సాయికుమార్ పని చేశారు. ప్రస్తుతం సాయికుమార్ SR కళ్యాణ మండపం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని తాను ఛాన్స్ అడిగితే రొటీన్ పాత్రలే చేస్తున్నామని కామెంట్లు చేశారని సాయికుమార్ చెప్పుకొచ్చారు. చిరంజీవిని తాను అన్నయ్య అని పిలుస్తానని ఏదైనా మంచి పాత్రలో నటించాలని ఉందని అడగగా కొత్తగా చేయమని తనకు చెప్పారని సాయికుమార్ అన్నారు.

SR కళ్యాణమండపంలోని పాత్ర ఒక లెవెల్ సంతృప్తిని ఇస్తుందని ఈ సినిమాలో తాను కొత్తగా కనిపిస్తానంటూ సాయికుమార్ చిరంజీవి విమర్శకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో కూడా వైవిధ్యమైన సినిమాల్లో నటించి కొత్తనటుడిని బయటకు తీస్తానని సాయికుమార్ వెల్లడించారు. ఈ సినిమాతో సాయికుమార్ నటుడిగా మరో హిట్ ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus