ఫేక్ అని నిర్మాత చెప్పినా నమ్మడం లేదు

  • July 2, 2018 / 01:02 PM IST

ఫోటోషాప్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మన సినిమాలకి అఫీషియల్ గా వర్క్ చేసే పబ్లిసిటీ డైజనర్లు క్రియేట్ చేసే సినిమా పోస్టర్స్ కంటే.. సదరు హీరోల అభిమానులు క్రియేట్ చేసే పోస్టర్సే అద్భుతంగా ఉంటున్నాయి. ఒక్కొక్కళ్లూ క్రియేటివిటీని వీరలెవల్లో వినియోగిస్తూ డిజనర్లకు పోటీ ఇస్తూ.. హీరోలను ఒక్కోసారి సంభ్రమాశ్చర్యానికి లోనూ చేస్తూ.. ఒక్కోసారి అత్యుత్సాహంతో బాధపెడుతున్నారు కూడా. నవతరం హీరోల్లో నాగచైతన్యకి ఉన్న క్రేజ్ వేరు. లవర్ బోయ్ ఇమేజ్ తోపాటు.. మాస్ ఆడియన్స్ లోనూ చైతూకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే.. మనోడి తాజా చిత్రం “శైలజా రెడ్డి” అల్లుడుకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రమ్యకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తుండగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆఖరి షెడ్యూల్లో ఉంది.

అయితే.. నిన్న ఉదయం నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ వచ్చింది. ఇది ఒరిజినల్ పోస్టర్ కాదు ఎవరో ఓ వీరాభిమాని క్రియేట్ చేసిన ఫేక్ పోస్టర్ అని తెలుసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. తెలిసేలోపు పోస్టర్ వైరల్ అయిపోవడంతో.. స్వయంగా నిర్మాత వంశీ రంగంలోకి దిగి “అది ఫేక్ పోస్టర్” అని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి ఆ పోస్టర్ లో ఫోటో “ప్రేమమ్” సినిమాలోనిది. కానీ.. పోస్టర్ క్రియేట్ చేసిన వీరాభిమాని ఎవడో మంచి టాలెంటెడ్ డిజైనర్ లా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus