‘జాక్’.. దర్శకుడు లేకుండానే ఆ సాంగ్ షూట్ చెశారా?

సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్(Bhaskar) ..ల కలయికలో ‘జాక్’ (Jack) అనే సినిమా రూపొందింది. వైష్ణవి చైతన్య  (Vaishnavi Chaitanya) ఇందులో హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) ,బాపినీడు నిర్మాతలు. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు భాస్కర్..హీరో సిద్దు..ల మధ్య గొడవలు జరిగాయని, దీంతో దర్శకుడు లేకుండానే సిద్ధు హయాంలో ఓ సాంగ్ కూడా షూట్ చేసినట్లు టాక్ నడిచింది. దీనిపై దర్శకుడు, హీరో క్లారిటీ ఇచ్చారు.

Siddhu Jonnalagadda, Bommarillu Bhaskar

ముందుగా దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ.. ‘సిద్ధు (Siddu Jonnalagadda) కచ్చితంగా మల్టీ టాలెంటెడ్. అతనికి ఒక సీన్ చెప్పాక మనం ఏమీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. స్టార్ట్ కెమెరా చెప్పేసి ఊరుకుంటే సరిపోతుంది. అయితే ఒక సీన్ తీసే ముందు ఆఫీస్ రూమ్లో చాలా డిస్కస్ చేసుకుంటాం. నా రైటర్స్ తో ఆర్గ్యుమెంట్ వంటివి కూడా జరుగుతాయి. కానీ అవన్నీ రూమ్ వరకే. బయటకి ఒక సంతృప్తితో వస్తాం’ అన్నట్టు చెప్పుకొచ్చాడు.

మరోపక్క సిద్ధు మాట్లాడుతూ.. ‘ఒక సాంగ్ ఆయన లేకుండా తీశాము అంటున్నారు.దానికి డైరెక్టర్ చేసేది ఏమీ ఉండదు కాబట్టి.. ఆయన ఎడిటింగ్లో కూర్చుంటాను.. మీరు వెళ్లి షూట్ చేసుకుని వచ్చేయండి అని చెప్పాడు. దానికి మీరు ఏసీలో కూర్చుంటారు.. మేము ఎండలో షూట్ చేసుకుని రావాలా?’ అంటూ సెటైర్లు కూడా వేసుకున్నాం. అంతకు మించి మా మధ్యలో ఎటువంటి గొడవలు లేవు’ అంటూ తన వెర్షన్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కూడా మైక్ అందుకుని.. ‘మీరంతా బెడ్ రూమ్ వరకు వెళ్ళకండి. ఆఫీస్ బయట వరకు మాత్రమే ఉందాం’ అంటూ సెటైర్ విసిరాడు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి

దాదా సాహేబ్‌ అవార్డు గ్రహీత.. ప్రముఖ డైరక్టర్‌ ఇకలేరు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus