Saindhav Collections: ‘సైంధవ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!
- April 14, 2024 / 03:21 PM ISTByFilmy Focus
విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా ‘హిట్’ ‘హిట్ 2’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘సైంధవ్'(Saindhav) . ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ (Shradha Srinath) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ హీరో ఆర్య (Arya), ఆండ్రియా (Andrea Jeremiah), బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui), జిస్సు సేన్ గుప్తా (Jisshu Sengupta) .. కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.ఫైనల్ గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :
| నైజాం | 3.85 cr |
| సీడెడ్ | 1.14 cr |
| ఉత్తరాంధ్ర | 1.43 cr |
| ఈస్ట్ | 0.93 cr |
| వెస్ట్ | 0.51 cr |
| గుంటూరు | 0.73 cr |
| కృష్ణా | 0.79 cr |
| నెల్లూరు | 0.34 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.70 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.58 cr |
| ఓవర్సీస్ | 1.02 cr |
| వరల్డ్ వైడ్( టోటల్) | 11.30 cr (షేర్) |
‘సైంధవ్’ చిత్రానికి రూ.24.7 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.11.3 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.13.7 కోట్ల దూరంలో ఆగిపోయింది.
















