Saindhav: లెక్కలు మారతాయి.. వెంకటేష్ మాస్.. అంతే.!

వెంకటేష్ 75వ సినిమాగా సైందవ్ రాబోతున్న సంగతి తెలిసిందే. హిట్, హిట్ 2 చిత్రాలతో సూపర్ ఫామ్ లో ఉన్న శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సూపర్ హిట్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుపెట్టిన వెంకట్ బోయనపల్లి తన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఈ చిత్రంలో (Saindhav) తమిళ హీరో ఆర్య కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ టీజర్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇక ఈ విషయానికి వస్తే.. ఇది దాదాపు రెండు నిమిషాల నిడివి కలిగి ఉంది. టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ ను మాస్ గా చూపించాడు దర్శకుడు శైలేష్ కొలను.

‘ భయం లేదు.. లెక్కలు మారతాయి నా కొడక, ‘ వంటి డైలాగ్స్ వెంకటేష్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే విధంగా ఉన్నాయి. సంతోష్ నారాయణ అందించిన నేపధ్య సంగీతం కూడా సూపర్ అని చెప్పాలి. తప్పకుండా ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో స్పెషల్ మూవీ అవుతుంది అనే ఫీలింగ్ కలిగించింది. మీరు కూడా ఒకసారి చూడండి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus