Sai Tej: మెగాస్టార్ చిరంజీవిపై సాయితేజ్ కు ఇంత అభిమానమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోలలో సాయితేజ్ ఒకరు. ఈ మధ్య కాలంలో సాయితేజ్ కు సరైన సక్సెస్ లేకపోయినా తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ దక్కుతుందని ఈ హీరో భావిస్తున్నారు. ఒకప్పుడు సుప్రీం హీరో బిరుదు చిరంజీవిది కాగా ఇప్పుడు సాయితేజ్ సుప్రీం హీరో ట్యాగ్ ను వాడుకుంటున్నారు. సాయితేజ్ సినిమాలను గమనిస్తే ఆయన పేరుకు ముందు సుప్రీం హీరో అనే ట్యాగ్ కచ్చితంగా ఉంటుంది.

గతంలో కొంతమంది నెటిజన్లు ఈ విషయంలో సాయితేజ్ పై విమర్శలుచేశారు. అయితే తాజాగా సాయితేజ్ ఆ ట్యాగ్ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మామయ్య చిరంజీవి నా ధైర్యం అని సాయితేజ్ అన్నారు. నేను సుప్రీం హీరో ఏంటని చాలామంది అనుకోవచ్చని అయితే ఈ ట్యాగ్ వెనుక ఒక కథ ఉందని సాయితేజ్ కామెంట్లు చేశారు. ఐదు వేళ్లు అన్నం కలిపి నోట్లోకి వెళుతున్నాయంటే దానికి కారణం చిరంజీవి మామయ్యేనని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నేను ఎంత ఎత్తుకు ఎదిగినా అండగా నేనున్నాననే ధైర్యం ఇచ్చేలా మామయ్య బిరుదు ఉంటుందనే ఆలోచనతోనే నా పేరు ముందు సుప్రీం హీరో అని చేర్చుకున్నానని సాయితేజ్ కామెంట్లు చేశారు. సుప్రీం హీరో అనే ట్యాగ్ ఉంటే చిరంజీవి గారు నాతో పాటు ఉన్నారని నాకు అనిపిస్తుందని సాయితేజ్ చెప్పుకొచ్చారు. ఆ ట్యాగ్ నాకు ఎప్పటికప్పుడు బాధ్యతను తెలియజేస్తుందని తాను ఆ ట్యాగ్ ను పెట్టుకున్నానని సాయితేజ్ తెలిపారు.

సాయితేజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయితేజ్, పవన్ కాంబినేషన్ లో వినోదాయ సిత్తమ్ రీమేక్ తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో 30 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. పవన్ సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus