Yatra2: ‘సైతాన్’ .. పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడేలా చేసిందిగా..!

దర్శకుడు మహి వి రాఘవ్.. చాలా మంచి సినిమాలు తీశారు. ‘పాఠశాల’ తో దర్శకుడిగా మారిన ఇతను ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా ‘సేవ్ ది టైగర్స్’ అనే వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కించారు. దీనికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఈ వెబ్ సిరీస్ ఉంది.

దీంతో మహి వి రాఘవ్ పై మంచి దర్శకుడు అనే ముద్ర కూడా పడింది. మరీ ముఖ్యంగా ‘యాత్ర’ సినిమా విడుదలకు ముందు.. ఆ సినిమా పై అంచనాలు పెద్దగా లేవు. అది దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్. పైగా మహి వి రాఘవ్ ఆయన అభిమాని కాబట్టి.. అయితే భజన చేసినట్లు లేదా స్పీచ్ లు ఇస్తున్నట్లు ఉంటుందనే కామెంట్లు కూడా వినిపించాయి.

కానీ పాదయాత్ర అనే పాయింట్ ను మాత్రమే తీసుకుని.. చాలా ఆసక్తికరంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి రాఘవ్. అటు తర్వాత ‘యాత్ర 2’ కూడా ఉంటుంది అని అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటికీ ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. 2024 ఎలక్షన్స్ టైంకి ఆ చిత్రాన్ని రిలీజ్ చేసేలా మహి వి రాఘవ్ ప్లాన్ చేసుకున్నట్టు టాక్ నడుస్తుంది. వైకాపా పార్టీ కూడా అదే కోరుకుంటున్నట్టు టాక్ కూడా నడుస్తుంది.

కానీ ఇంతలో ఓ బాంబ్ పేల్చాడు మహి వి రాఘవ్. అతని దర్శకత్వంలో ‘సైతాన్’ అనే మరో వెబ్ సిరీస్ కూడా రూపొందింది. ఇందులో ఘోరమైన బూతులు, హింస ఉంది. ఇవి చూస్తుంటే ‘మహి వి రాఘవ్ గాడి తప్పాడా?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి (Yatra2) ‘యాత్ర 2’ విషయంలో ఏం చేస్తాడో చూడాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus