Jr NTR: ఎన్టీఆర్ 30కు శక్తి సెంటిమెంట్.. టెన్షన్ లో ఫ్యాన్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తుండగా ఎవరు ఫైనల్ అవుతారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అయితే వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో కొంతభాగం షూటింగ్ ఈజిప్ట్ లో జరగనుంది.

ఈ సినిమాకు సంబంధించి దాదాపు 40 శాతం షూటింగ్ ఈజిప్ట్ లో జరుగుతుందని సమాచారం. అయితే ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలోని కొంత భాగం షూటింగ్ ఈజిఫ్ట్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిచింది. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం కొరటాల శివ సినిమా కంటే కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.

కొరటాల శివ ఒకవైపు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తూనే మరోవైపు ఈ సినిమాలో నటించే నటీనటులు, టెక్నీషియన్లను ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ, రష్మిక మందన్నా, అలియా భట్ పేర్లు వినిపిస్తుండగా ఎవరు ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా కొరటాల స్నేహితుడు శివ మిక్కిలినేని సుధాకర్, నందమూర్ కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus