‘సలార్‌: శౌర్యాంగ పర్వం’… చాలా ప్రశ్నలు… చాలా చిక్కుముళ్లు!

ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న ‘సలార్‌’ తొలి సినిమా వచ్చేసింది. థియేటర్లలో ‘సీజ్‌ ఫైర్‌’ రచ్చ రచ్చ చేస్తోంది. కోట్లాభిషేకం అందుకుంటున్న ‘సలారుడు’… రెండో పార్ట్‌ ‘శౌర్యాంగ పర్వం’ ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే తొలి పార్టులో ఆకట్టుకునేంత పరిస్థితి రెండో పార్టులో ఉండదు. గతంలో ‘కేజీయఫ్‌’ విషయంలో ఇదే చూశాం. తొలి సినిమా కంటే కొన్ని విషయాల్లో రెండో సినిమా ఇబ్బందిపడింది. అలాగే ‘సలార్‌ 1’లో వదిలేసిన చిక్కుముళ్లు అన్నీ విప్పాలి.

‘సలార్ : ది సీజ్‌ ఫైర్‌’ సినిమాకు పార్ట్ 2గా ‘సలార్‌: శౌర్యాంగ పర్వం’ అనేను ఫిక్స్‌ చేసేశారు. సినిమా ఎండ్‌ టైటిల్స్‌లో ఆ పేరు వేశారు కూడా. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావొచ్చు అనే విషయంలో ఇంకా ఎలాంటి వార్తలు, పుకార్లు రాలేదు. అయితే ఈ సినిమా వస్తే అందులో దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా చిక్కుముళ్లు విప్పాలి. అందులో ప్రధానమైన విషయం దేవరత అలియాస్‌ దేవా తండ్రి ఎవరు అనేది. ‘బాహుబలి’ సినిమాలో తరహాలో ఈ పాత్ర కూడా ప్రభాసే చేశాడని అంటున్నారు.

ఇక హీరోయిన్ శ్రుతి హాసన్‌ను విలన్లు ఎందుకు వెంటాడుతున్నారనేది మరో ప్రశ్న. ఆమె తండ్రి సినిమాలో రాధా రమ మన్నార్‌ పార్టీలోనే ఉన్నట్లు చూపించారు. మరి ఎందుకు విదేశాలకు వెళ్లిపోయాడు అనేది చెప్పాలి. ఇక జగపతిబాబు పాత్ర ప్రాంత పెద్దగానే చూపించారు. అతని యంగ్‌ ఏజ్‌ను ఇంకా చూపించాలి. ఇక శౌర్యాంగ తెగకు చెందిన ప్రభాస్‌… తెగకు అనుకూలంగా ఉంటాడా? లేక స్నేహానికి విలువిస్తాడా అనేదీ చెప్పాలి. అసలు తన వాళ్లను అంతలా ఇబ్బందిపెట్టిన రాజమన్నార్‌ను దేవరత ఏం చేస్తాడు అనేదీ ఆసక్తికరం.

అన్నింటికి మించి పేరు పెట్టి పిలవగల ఏకైక స్నేహితుడు వరదరాజ మన్నార్‌కు దేవరతకు ఎందుకు వైరం వచ్చింది? ఆఖరికి దేవ, ఆద్య (శ్రుతి హాసన్‌) మధ్య ప్రేమ ఉందా? ఉంటే ఎప్పటిది? ఇలా చాలా ప్రశ్నలే ఉన్నాయి. వీటన్నింటిని రెండో పార్టులో ఎలా ప్లేస్‌ చేస్తారు అనేది ఆసక్తికరం. అన్నింటికి మించి తొలి పార్టును మించి రెండో సినిమా ఉండాలి. అంతకుమించిన ఎలివేషన్‌ సీన్లు కావాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus