Salaar: సలార్ లో ప్రభాస్ విశ్వరూపానికి బాహుబలి అవుట్!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్. కె.జి.ఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ వంటి స్టార్ తో చేస్తున్న చిత్రం కావడం తో ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలకు 100 రెట్లు ఎక్కువగా సలార్ సినిమా ఉండబోతుందని, మొన్న మీరు చూసిన కె.జి.ఎఫ్ సిరీస్ కేవలం సలార్ సినిమాకి టీజర్ లాంటిది అని, సలార్ చిత్రం ద్వారా విశ్వరూపాన్ని చూస్తారంటూ మేకర్స్ చెప్తున్నారు.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్రానికి (Salaar) సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఈ సన్నివేశం ప్రభాస్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని యాక్షన్ సీక్వెన్స్ తో నిండి ఉంటుందని, కేవలం ఈ సన్నివేశం కోసమే 35 కోట్ల రూపాయిలు ఖర్చు చేసారని టాక్. కె.జి.ఎఫ్ సిరీస్ లో ఇది వరకు మనం చూసిన ఎలివేషన్ సన్నివేశాలు మొత్తం, కేవలం ఇంటర్వెల్ సన్నివేశం తో సమానం అని, ఆ రేంజ్ డైరెక్టర్ తెరకెక్కించాడని తెలుస్తుంది.

ప్రభాస్ కి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న స్టార్ స్టేటస్ కి ఇలాంటి సన్నివేశాలు ఒక్కటి పడినా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఒక్కటి కూడా మిగలదు అని అంటున్నారు విశ్లేషకులు. ఆయన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయితేనే ఒకటి 400 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు మరొకటి 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసాయి.

ఇక ఈ రేంజ్ ప్రాజెక్ట్స్ తగిలితే ఎలా ఉంటుందో అని , బాహుబలి 2 ఫుల్ రన్ కలెక్షన్స్ (2000 కోట్లు) ని దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి సలార్ విడుదల తర్వాత ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో అనేది చూడాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus