Salaar Collections: ‘సలార్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ కలయికలో రూపొందిన భారీ బడ్జెట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘సలార్’. ‘హంబలే ఫిలిమ్స్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈరోజు అనగా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. తెలుగుతోనే కాకుండా కన్నడ, హిందీ, మలయాళ,తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యింది ‘సలార్'(సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్). మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు చేస్తున్న సందడి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అనే విషయం పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. షారుఖ్ ఖాన్ – రాజ్ కుమార్ హిరానీ,,ల ‘డంకీ’ వంటి పెద్ద సినిమా పోటీగా ఉంది కాబట్టి.. ‘సలార్’ రికార్డు కలెక్షన్స్ ను సాధిస్తుందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే పోటీలో కూడా ‘సలార్’ మొదటి రోజు రూ.130 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

తెలుగు,హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ఈ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ తమిళంలోనే ఆశించిన స్థాయిలో కలెక్ట్ చెయ్యట్లేదు అనే కంప్లైంట్ ఉంది. ఏది ఏమైనా ఈ ఏడాది ‘ఆదిపురుష్’ తో ‘సలార్’ రూపంలో మొదటి రోజుకి గాను ప్రభాస్ ఖాతాలో మరో రూ.100 కోట్ల గ్రాస్ మూవీ పడనుంది అని చెప్పాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus