NTR31: ఎన్టీఆర్ 31 సినిమాపై ఈ వార్తలు నిజమేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్30 కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమా షూట్ పూర్తైన వెంటనే తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ మొదలుకానుంది. అయితే సలార్ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్31 మూవీపై ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఒక సినిమా షూట్ పూర్తైన వెంటనే రిలీజ్ డేట్ తో పని లేకుండా మరో సినిమాను మొదలుపెడతారు.

ఎన్టీఆర్31 మూవీ గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్నాయి. ఎన్టీఆర్31 కోసం ప్రశాంత్ నీల్ అద్భుతమైన స్టోరీ లైన్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్31 కు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్31 మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనుండగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాసినిమాకు తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. తారక్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 32వ సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ సినిమా డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా ఈ సినిమా తారక్ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus