Salaar OTT: భారీ ధరలకు సలార్ ఓటీటీ రైట్స్ కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సలార్. ఈ సినిమా ఇప్పటికే బెనిఫిట్ షోస్ అన్ని కూడా పూర్తి అవ్వడంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి పలువురు సెలబ్రిటీలు కూడా వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఈ సినిమా సరైన హిట్ అందించిందని అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక కమర్షియల్ గా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే తాజాగా సలార్ సినిమాకి సంబంధించినటువంటి ఓటీటీ రైట్స్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తుంది.

ఈ సినిమా (Salaar) డిజిటల్ హక్కులను అన్ని భాషలలో కలిపి నెట్ ఫ్లిక్స్ 160 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విషయానికి వస్తే సాధారణంగా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నటువంటి సినిమాలన్నీ కూడా నెల రోజులలోపే ఓటీటీ లలో ప్రసారమవుతు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బహుశా నెల రోజుల తరువాతనే ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ స్ట్రీమింగ్ విషయాల గురించి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన తెలియచేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మాత్రం థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇప్పటికే హీరో నిఖిల్ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించగా స్నేహితుడు పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించి సందడి చేశారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus