Salaar: సలార్ మూవీ ఖాతాలో అరుదైన రికార్డులు.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ థియేటర్లలో కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం నార్త్ లో సైతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం. ప్రస్తుతం #salaargoesglobal అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇతర దేశాల్లోని నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్లు సలార్ సినిమాను చూసి ఈ సినిమా గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

విదేశాల్లోని ప్రేక్షకులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలుస్తుండగా ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. సలార్ మూవీ భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సలార్ సినిమా రెండో భాగం షూట్ త్వరలో మొదలుకానుండగా 2025 సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంతో సలార్2 సెట్స్ పైకి వెళ్తే వేగంగా షూట్ ను పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సలార్2 మూవీ కలెక్షన్ల పరంగా సంచలనాలను సృష్టిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సలార్ మూవీ (Salaar) ఇంగ్లీష్ వెర్షన్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్ కల్కి 2898 ఏడీ, రాజాసాబ్ సినిమాల నుంచి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. సలార్2 మూవీ 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సలార్2 సినిమాలో శృతి హాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus