Salaar: సలార్ మూవీ కథను అలా ప్లాన్ చేసిన నీల్.. మామూలోడు కాదుగా!

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా సలార్ నిలవనుంది. అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే ఈ సినిమా స్నేహానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. స్నేహం కోసం శత్రువు ప్రాణాలు తీసే పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని అయితే మదర్ సెంటిమెంట్ కు మరీ ఎక్కువగా ప్రాధాన్యత ఉండదని సమాచారం అందుతోంది. అయితే టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత మాత్రమే ఈ సినిమా కథకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సలార్ మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.

ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా సలార్ ఉండనుందని ప్రశాంత్ నీల్ మామూలోడు కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమా ఫ్యాన్స్ ఆశలను కచ్చితంగా నెరవేరుస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను సలార్ మూవీ మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శృతి పాత్రకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. కేజీఎఫ్2 సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. సలార్ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus