Salaar Teaser: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ‘సలార్‌’ నుండి గుడ్‌ న్యూస్‌!

‘కేజీయఫ్‌ 2’ సినిమాతో ‘సలార్‌’ టీజర్‌ రిలీజ్‌ అంటూ… ఇటీవల తెగ పుకార్లు వచ్చాయి. ప్రభాస్‌ లాంటి పెద్ద హీరో సినిమా టీజర్‌ అలా వేరే సినిమాతో రిలీజ్‌ చేస్తారా? అని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కారు కూడా. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెతలా… టీజర్‌ కట్‌ చేయనిదే ఆ పుకారు వస్తుందా అని అనుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే రెండో స్టైల్‌ మనుషుల మాటే నిజమైంది. ‘సలార్‌’ సినిమా కోసం ఓ టీజర్‌ రెడీ చేసి సెన్సార్‌ కూడా పూర్తి చేశారట.

Click Here To Watch NOW

సినిమా టీజర్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సర్టిఫికెట్‌ ప్రకారం చూస్తే సినిమా కోసం ఒకటిన్నర నిమిషం టీజర్‌ను ప్రశాంత్‌ నీల్‌ సిద్ధం చేశారట. ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌గా వీడియోను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఇంతలా రెడీ చేసి ఎందుకు రిలీజ్‌ చేయలేదు అనే ప్రశ్న ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అయితే దీనికి వినిపస్తున్న సమాధానం… ‘సలార్’ టీజర్‌ను స్పెషల్‌గా నేరుగా విడుదల చేయాలని అనుకోవడమే అని టాక్‌.

‘కేజీయఫ్‌ 2’ ఫీవర్‌లో ‘సలార్’ టీజర్‌ను తీసుకొస్తే ఆ హవాలో పక్కకు వెళ్లిపోతుంది అనే ఆలోచనతోనే ఇలా చేశారని టాక్‌. అయితే టీజర్‌ వస్తుందనీ చిత్రబృందం చెప్పలేదు, అలా అని రాదు అని చెప్పలేదు. అలాంటప్పుడు ఎందుకు రాలేదో చెప్పాలనుకోవడం అత్యాశే అవుతుంది. అయితే సోలో ప్రమోషన్‌ బెటర్‌ అని ప్రభాస్‌ అనుకోవడం వల్లే ఇలాంటి మార్పు జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ రోజు ‘కేజీయఫ్‌ 2’ విడుదలైపోవడంతో… ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ పనులు రీస్టార్ట్‌ చేస్తారని టాక్‌.

ఆ సినిమా ప్రచారంలో పడి.. ఈ సినిమాకు కొద్ది రోజులు గ్యాప్‌ ఇచ్చారు. ఈలోగా ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ ప్రచారం చేసుకున్నాడు. ఆ తర్వాత రెస్ట్‌ తీసుకుంటున్నాడు. పనిలోపనిగా మిగిలిన సినిమాలు చూసుకున్నాడు. ప్రశాంత్‌ రెడీ అంటే ‘సలార్‌’ కొత్త షెడ్యూల్‌ మొదలుపెట్టేస్తారట. మరి ఆ టీజర్‌ ఏ చేస్తారు అనేగా మీ ప్రశ్న. మేలో రిలీజ్‌ చేద్దామని చూస్తున్నారు అనేది లేటెస్ట్‌ టాక్‌.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus