ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ‘సలార్’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్.. మన ‘బాహుబలి'(సిరీస్) హీరో ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 22న ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో తెలుగు, కన్నడంతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
కాబట్టి ఇప్పుడంతా ‘సలార్’ మేనియానే నడుస్తుంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ‘సలార్’ టికెట్ల గురించి కామెంట్లు, డిస్కషన్లు పెట్టుకుంటున్నారు.’సలార్’ ఆన్ లైన్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా.. ఎన్ని టికెట్లు దొరుకుతాయా.. ఏ షోకి దొరుకుతాయా?’ అంటూ అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో ‘సలార్’ అభిమానులకి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. మేటర్ ఏంటంటే.. ‘సలార్ పార్ట్ 1 :సీజ్ ఫైర్’ ను నైజాంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ రిలీజ్ చేస్తుంది.
ఆన్లైన్ బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి మైత్రి సంస్థ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మేటర్ ఏంటంటే.. ‘సలార్’ ఆన్లైన్ బుకింగ్స్ ఉండవట. థియేటర్ కి వెళ్లి కౌంటర్ల వద్ద లైన్లో నిలబడే టికెట్లు తీసుకోవాలని ‘మైత్రి’ సంస్థ ఓ ట్వీట్ వేసింది. ఒకప్పుడు కొత్త సినిమాలకి టికెట్ల కోసం జనాలు థియేటర్ వద్ద ఎలా నిలబడి కష్టపడేవారో ఆ రోజులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఇది అని .. ఆ ట్వీట్లో ఉంది.
దీంతో ఒక్కసారిగా అందరి మైండ్ బ్లాక్ అయ్యింది అని చెప్పాలి. ‘సలార్’ వంటి పెద్ద సినిమాకి ఆన్లైన్ బుకింగ్స్ లేకపోవడం ఏంటి.. అంటూ ‘మైత్రి’ సంస్థని విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇక ‘బుక్ మై షోలో’ ‘సలార్’ (Salaar) మూవీకి 1.4 మిలియన్ ఇంట్రెస్ట్స్ నమోదైన సంగతి అందరికీ తెలిసిందే.
https://twitter.com/MythriOfficial/status/1736722811773956253
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!