Salaar Twitter Review: ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 22, 2023 / 06:45 AM IST

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందింది. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో రిలీజ్ కాబోతుంది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 22న అంటే మరికొన్ని గంటల్లో ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మిడ్ నైట్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘సలార్’ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందట. కథ కూడా ‘ఉగ్రం’ సినిమాకి చాలా సిమిలర్ గా అనిపించినా.. ఇది ప్రభాస్ ఇమేజ్ కి సూట్ అయ్యింది అని అంటున్నారు. ఫైట్స్ లో ప్రభాస్ తన గ్రేస్ చూపించి గూజ్ బంప్స్ తెప్పిస్తాడట. శృతి హాసన్ రోల్ బాగానే ఉందట. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్లో ఉన్నాయని.

ఎలివేషన్స్ ఎక్కువగా లేకపోయినా, పృథ్వీ రాజ్ – ప్రభాస్ కాంబో సీన్స్ ఆకట్టుకుంటాయని, క్లైమాక్స్ కూడా ఓకే అనిపిస్తుంది అని అంటున్నారు. మొత్తంగా ‘కె.జి.ఎఫ్’ రేంజ్ ఎలివేషన్స్ లేకపోయినా ‘సలార్’ ఆకట్టుకునే విధంగానే ఉంది అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలకు టాక్ ఎలా ఉంటుందో చూడాలి…

 

 

 

 

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus