‘సలార్’ సినిమా ఈ రోజుల థియేటర్లలోకి వచ్చేసింది. ‘డైనోసార్’ ప్రభాస్ విశ్వరూపానికి, పృథ్వీరాజ్ సుకుమారన్ వెర్సటైల్ నటనకు, ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నిర్మాత విజయ్ కిరంగదూర్ మాటలు వింటే ఆ కాన్ఫిడెన్స్ మీకే అర్థమవుతుంది. అంతేకాదు ఆయన మాటలు బట్టి ప్రభాస్ ఫ్యాన్స్ దిగులు కూడా పోతుంది. అదే సినిమా కోసం భారీ బహిరంగ సభ. సినిమా రిలీజ్ ముందు చూడని సభను సినిమా రిలీజ్ తర్వాత పెడతారట.
‘సలార్’ సినిమా విడుదల నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రచారంలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎందుకు కనిపించలేదు అనే విషయం చెప్పారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ‘సలార్’ సినిమా విడుదల తర్వాత హైదరాబాద్‌లో ఓ పెద్ద వేడుక నిర్వహిస్తాం. ప్రశాంత్, ప్రభాస్ ఇప్పుడు బిజీగా ఉండటంతో విడుదలకి ముందు ప్రీరిలీజ్ వేడుక నిర్వహించడం కుదర్లేదు అని చెప్పారు.
ఆయన ‘సలార్’ (Salaar) గురించి మాట్లాడుతూ సినిమా షూటింగ్‌ని 90 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి చేశామని చెప్పారు. భారతీయ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలనేదే తమ ఆలోచన అని గుర్తు చేశారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు అన్నీ వేర్వేరుగా ఉంటాయని వాటిని తమ సినిమాల్లో ప్రతిబింబించేలా చూస్తున్నామని విజయ్ తెలిపారు. తమ సినిమాలు అలాంటి ఆలోచనతోనే చేస్తామని కూడా చెప్పారు.
తమకు ప్రశాంత్ నీల్ ఒక దర్శకుడిగానే పరిచయం అయ్యారని, ఇప్పుడు సన్నిహిత మిత్రుడిగా మారారు అని చెప్పారు. తన క్రియేటివిటీకి హోంబలే ఫిల్మ్స్ ఓ ప్లాట్‌ఫామ్ అని చెప్పారు. ప్రశాంత్ ఆలోచనలకు అవసరమైన అన్నింటిని సమకూర్చడం తమ పని అని చెప్పారు. అంతేకాదు ప్రశాంత్ నీల్ ఎప్పుడూ నిర్మాణం విషయం గురించే ఆలోచిస్తుంటారని, సినిమాల మార్కెటింగ్ విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోరు అని చెప్పారు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!