ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘సలార్’ సినిమా గురించి అభిమానులు నెలలు తరబడి వెయిట్ చేస్తున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం సెప్టెంబరులో రావాల్సిన సినిమా వివిధ కారణాల వల్ల డిసెంబరు 22న వస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సినిమా గురించి అభిమానుల్లో ఉన్న ఒకే ఒక్క గుబులు ‘ఇంకా ఎందుకు బుకింగ్స్ ప్రారంభం కాలేదు’. ఆన్‌లైన్‌లో ఎప్పుడు టికెట్లు పెడతారు, స్పెషల్ షోల సంగతేంటి, టికెట్ రేట్ల సంగతేంటి అనేవే వారి ప్రశ్నలు.
అయితే, ఇప్పుడు వాటన్నింటికి సమాధానాలు వచ్చేశాయి. అంతేకాదు తెలంగాణలో స్పెషల్ షోలు పడుతున్న థియేటర్ల జాబితా కూడా వచ్చేసింది. దీంతో థియేటర్ల దగ్గర రద్దీ మొదలైంది. నానా రచ్చ కూడా జరుగుతోంది. వాటి సంగతి తర్వాత చూద్దాం. తొలుత థియేటర్ల సంగతి చూద్దాం. మొత్తం తెలంగాణలో 20 థియేటర్లలో ప్రత్యేక షోలు పడనుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 12 థియేటర్లలో షోస్ వేస్తున్నారు. ‘సలార్’ సినిమాకు రోజుకు ఆరు షోలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
అంతేకాదు విడుదల రోజు ఈ థియేటర్లలో బెనిఫిట్ షో వేసుకోవడానికి కూడా అంగీకరించింది. నగరంలో నెక్సస్ మాల్ – కూకట్‌పల్లి, ఏఎంబీ సినిమాస్ – గచ్చిబౌలి, భ్రమరాంబ – కూకట్‌పల్లి, మల్లికార్జున – కూకట్‌పల్లి, అర్జున్ – కూకట్‌పల్లి, విశ్వనాథ్ – కూకట్‌పల్లి, సంధ్య 70ఎంఎం – ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సంధ్య 35ఎంఎం – ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, రాజధాని డీలక్స్ – దిల్‌సుఖ్ నగర్, శ్రీరాములు – మూసాపేట, గోకుల్ – ఎర్రగడ్డ, శ్రీ సాయిరాం – మల్కాజిగిరిలో వేస్తున్నారు.
ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల సంగతి చూస్తే.. ఎస్వీసీ తిరుమల – ఖమ్మం, వినోద్ – ఖమ్మం, వెంకటేశ్వర – కరీంనగర్, నటరాజ్ – నల్గొండ, ఎస్వీసీ విజయ – నిజామాబాద్, వెంకటేశ్వర – మహబూబ్ నగర్, శ్రీనివాసా – మహబూబ్ నగర్, రాధిక – వరంగల్ థియేటర్లు ఉన్నాయి. రెండు పార్టులుగా వస్తున్న ‘సలార్’లో మొదటి పార్టుకు ‘సలార్: సీజ్ ఫైర్’ అని పేరు పెట్టారు. ‘బాహుబలి’ తర్వాత విజయాల్లేని ప్రభాస్‌కు ఈ (Salaar) సినిమా ఫలితం చాలా కీలకం అని చెప్పాలి.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!